Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్‌పేట్
కరోనా బాధితులకు అండగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది అని లయన్స్ కబ్ల్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్డ్ ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారం సత్యనారాయణ చిన్న కుమార్తె కాచం తన్మరు పుట్టినరోజు సందర్భంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల కొన్ని కుటుంబాలు ఛిద్రం అయ్యాయి, కరోనా సెకండ్ వేవ్ ఉధ¸తి తగ్గినా దాని బారిన పడే వారి సంఖ్య పెరుగు తూనే ఉంది అన్నారు. లయన్స్కబ్ల్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కరోనా బాధితులకు అండగా నిలవాలన్న సదుద్దే శంతో ఉచిత ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందిస్తూ సమాజం లో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తుంది అని తెలిపారు. ఇందులో భాగంగా కరోనాతో బాధపడుతున్న బాధితుడి సోదరుడు పరమేశ్‌కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో లయన్ బాదం శ్రీనివాస్, లయన్ కాచం సాయి, లయన్ నంగునూరి రమేష్, లయన్ కల్యాణ్, లయన్ విద్యాసాగర్ పాల్గొన్నారు.