Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
వర్షాలకు పూర్తిగా గుంతలమయమైన రోడ్డు మరమ్మతు పనులను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. తన స్వగ్రామం ఆయిన ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామం ప్రధాన కూడలిలో గతంలో కురిసిన వర్షాలకు పూర్తిగా గుంతల మయమవ్వడంతో ప్రయాణి కులు, వాహనదారులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గుర్తించిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ వంగూరి శివశంకర్‌తో కలసి ప్రత్యేక చొరవతో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిం చినపుడే ప్రజలు నాయకులను గుర్తిస్తారని అన్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలతో రాత్రి సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సత్వర పరిష్కారంగా మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అబేధా బేగం, వార్డు సభ్యులు కొరుబోతు గోవర్ధన్, గ్యార సుధాకర్, టీిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, నాయకులు మలిపెద్ది సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గ్గొన్నారు.