Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-ఉప్పల్
చిలుకానగర్ డివిజన్లోని అమ్మవారి దేవాలయాలకు బోనాల పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే నిధులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతప్రవీణ్ ముదిరాజ్ మరియు ఈవో భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకానగర్ డివిజన్‌కు సంబంధించిన ఆలయ ప్రతినిధులు ఎమ్మెల్యే, కార్పొరేటర్ చేతుల మీదుగా చెక్కులు అందుకోవడం జరిగింది. చిలుకానగర్ డివిజన్లో గత నాలుగు సంవత్సరాలుగా మూడు దేవాలయాలకు చెక్కులు వచ్చేవి. నూతనంగా ఈసారి మరో ఐదు దేవాలయాలకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ చెక్కు ఇవ్వడం జరిగింది. మొత్తం చిలుకానగర్ డివిజన్‌కి సంబంధించిన 8 దేవాలయాలకు చెక్కులు అందజేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్‌కి, ఈఓ భాగ్యలక్ష్మికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు వీబీ నర్సింహ, పల్లె నర్సింగ్‌రావు, ఏదుల కొండల్‌రెడ్డి, పెరబోయిన వెంకటేష్, కోకొండ జగన్, బింగి శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, రామానుజం, బాలు, శ్యామ్, బాలకష్ణ, నారాయణ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.