Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
దశల వారీగా గ్రామంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాలయాల కల్పనకు కృషి చేస్తున్నామని సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం ఘణపూర్ గ్రామ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో పంచాయితీ నిధులతో సీసీి రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి పాలవర్గం నిరంతరం కృషిచేస్తుందని అన్నారు. సీసీి రోడ్డు నిర్మాణ పనులలో నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని, నాణ్యత లోపిస్తే చర్యలు ఉంటాయని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గట్టగళ్ళ రవి, వార్డు సభ్యులు వేముల పరమేష్‌గౌడ్, చిలుగూరి భాస్కర్, వేముల పద్మ, మందుల మయూరి, వేముల శోభ, గుగులోత్ కాంతమ్మ, వడ్త్యా పవన్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు వట్టి ఇన్నారెడ్డి, నానావత్ సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, నాయకులు వేముల శంకర్‌గౌడ్, మందుల మహేందర్, మంతెన సాయిరెడ్డి, కొయ్యాడ శ్రీనివాస్, వెంకటేష్ చారి, మక్తల మహేందర్, మంద కరుణాకర్, పరుశరాం, కాలనీ వాసులు తదితరులు పాల్గ్గొన్నారు.