Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ మజీద్ వద్ద భారీ వర్షాలకు ఫారెస్ట్ ప్రహరీ గోడ కూలిపోయి నీరంతా నిలిచి దోమలు ఉత్పత్తి అవుతున్నాయని, దాని ద్వారా పరిసర కాలనీవాసులు రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఎన్టమాలజీ సిబ్బంది సహాయంతో డ్రోన్ కెమెరాలతో దోమల నివారణ పిచికారి చేయడం మంచిదని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌లో వర్షాలకు నీరు నిలిచి దుర్గంధపూరితమైన దుర్వాసన వస్తుందని కాలనీవాసులు వాపోతున్నారని, దోమల నివారణకు అన్ని రకాలుగా చర్యలు చేపడ తామని అన్నారు. ఫారెస్ట్, జీహెచ్ఎంసి అధికారులకు సమన్వయ లోపంతో ఈ ప్రాంతం అభివద్ధి నోచు కోలేదని, మన్సురాబాద్ నుండి ఔటర్ రింగ్‌రోడ్ వరకు లింక్ రోడ్డును వేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి అభివద్ధికి బాటలు వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజయ్య గౌడ్, భిక్షపతి, సాగర్, వెంకటేశం, రాములు, యాదయ్య, గాలయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సుభాష్ చందర్, సతీష్, కష్ణ, నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.