Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంటీ క్రైమ్ బ్యూరో రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఆంజనేయులు
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రజా సమస్యలపై ప్రత్యేక అవగాహన కలిగి, సామాజిక సేవ చేసే విధంగా కృషి చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంటీ క్రైమ్ బ్యూరో రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఆంజనేయులు పిలుపునిచ్చారు. సోమవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ కందుకూరు మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఆయిళ్ల దినేష్ గౌడ్, జనరల్ సెక్రెటరీ మోహన్, యూత్ వైస్ ప్రెసిడెంట్ రవికిషోర్, జనరల్ సెక్రెటరీగా కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు ప్రజల సమస్యలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలన్నారు. సామాజిక సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గారెడ్డి, జిల్లా జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, విజరు తదితరులు పాల్గొన్నారు.