Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దఊరే బ్రహ్మయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టిన మాదిరిగానే బీసీ బంధు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ద ఊరే బ్రహ్మయ్య అన్నారు. ఈమేరకు సోమవారం బీసీ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఫ్లకార్డులు ప్రదర్శించి డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం కేవలం హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు మాత్రమే కాకుండా ప్రతి దళిత బిడ్డకు వర్తింపజేయాలని కోరారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న బీసీలకు కూడా బీసీ బంధు ప్రవేశపెట్టి పెండింగ్లో ఉన్న సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు అందించాలన్నారు. కార్యక్రమంలో ఈడింపల్లి రమేష్, సాయి కుమార్, గాంధీ నాయక్, పవన్, అనిల్, పి బాలు, వినరు, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.