Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిరుపేద చిన్నపిల్లలకు విద్యపై ఆసక్తిని పెంచుతూ, వారికి చిన్న వయసు నుంచి విద్యాభివృద్ధి కల్పించడానికి అల్ నూర్ ఇస్లామిక్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ముందుకురావడం ఎంతో అభినందనీయమని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎండీ హాజీ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ డి పోచంపల్లి పరిధిలోని గండి మైసమ్మ సర్వేనెంబర్ 120, మల్లికార్జున కాలనీ 8వ వార్డు రాజీవ్ బస్తీలో సోమవారం అల్ నూర్ ఇస్లామిక్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా చిన్న పిల్లలకు తెలుగు, హిందీ, ఉర్దూ, అరబ్బీ భాషల్లో విద్య నేర్చుకునేందుకు నూతన పాఠశాల ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎండీ హాజీ భారు హాజరై పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఆల్ నూర్ ఇస్లామిక్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీఎస్ఆనంద్, చైర్మెన్ మహమ్మద్ అబ్దుల్ ఖలీల్ లతో కలిసి పిల్లలకు బుక్కులు, బలపాలు, పలకలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆశ బేగం, సమీరా బేగం, సైనస్ బేగం, రిజ్వానా బేగం, సొసైటీ సభ్యులు చాంద్ భారు, మాజీద్ ఎంఏ సమద్, మహమ్మద్ సలీమ్ ఉద్దీన్, మహమ్మద్ గౌస్ భాష, ఎండీ బషీర్, చాంద్ భారు, ఎంఏ అఖిమ్, మహమ్మద్ అస్లాం తదితరులు పాల్గొన్నారు.