Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీవీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనగామ సంతోష్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలో ఖాళీగా అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బహుజన విద్యార్థి సంఘం (బీవీఎస్) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనగామ సంతోష్ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నేటి వరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ లక్షా 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రకాల ఉద్యోగాలకు హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరుద్యోగ యువత నిరాశకు లోనుకాకుండా ధైర్యంతో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘ కట్ట సతీష్, సురేష్, కుమ్మరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.