Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి తెలిపారు. సోమవారం తార్నాక డివిజన్లోని పలు ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని, బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్దిగా పండుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తార్నాక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.