Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.6ను యథావిధిగా కొనసాగించేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం పట్ల తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్ హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు అండగా నిలబడి వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చేందుకు కృషి చేసిన న్యాయవాది పాండు ముదిరాజ్‌ను తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రతినిధి బృందం పుష్పగుచ్ఛాలను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించింది. ప్రభుత్వం వెంటనే జీవోను అమలు చేస్తూ మత్స్యకారుల అభ్యున్నతి కోసం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు బైండ్ల సత్యనారాయణ, సైదులు, రంజిత్, బాలు, జోరుక జగన్ తదితరులు పాల్గొన్నారు.