Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-ఓయూ
బంగారు తెలంగాణను సీఎం కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణ మార్చారని ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు, జాక్ నాయకులు అన్నారు. నిరుద్యోగ యువకుడు మొహమ్మద్ షబ్బీర్ ఆత్మహత్యకు నిరసనగా సోమవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నియామకాల కోసమే 1200 మంది విద్యార్థులు, యువకులు బలిదానం చేసుకున్నారని, తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల తరువాత కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగడం అంటే ఇది పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే అన్నారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన సిరిసేడు గ్రామానికి చెందిన మొహ్మద్ షబ్బీర్ అనే యువకుడు ఆదివారం జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద పడి మృతి చెందారన్నారు. షబ్బీర్ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోరాటాలతోనే ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు సాధించుకుందామని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులు వేల్పుల సంజరు, నలిగంటి శరత్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్, అంబేద్కర్, సురేష్ గౌడ్, కన్నం సునీల్, రాజు, సంతోష్, లింగం యాదవ్, ఎండీ పాషా, రవి తదితరులు పాల్గొన్నారు.