Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాగిల్లాపూర్‌లో గతంలో కేసులు నమోదైనా పరిస్థితి మళ్లీ మొదటికి..
- 8 చోట్ల ప్రభుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ ఇస్తే ఇప్పుడు కానరాని వైనం
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సి పాలిటీ గాగిల్లాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 214లో ఉన్న ప్రభుత్వ భూములు పలుచోట్ల కబ్జాలకు గురవు తున్నాయి. రాత్రికి రాత్రే కబ్జాదారులు అక్రమంగా నిర్మా ణాలు చేపడుతూ అధికార పార్టీకి చెందిన రంగులు వేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా సర్కారు, సంబంధిత అధికా రులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. గతంలో తహసీల్దార్ మల్లయ్య సర్కార్ భూముల కబ్జాపై కఠినంగా వ్యవహరించేవారు. ఆయన హయాంలో కబ్జాకు పాల్పడిన 8 మందిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు కూడా. అప్పట్లో వెనక్కి తగ్గిన కబ్జాదారులు ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి సుమారు రూ.80 లక్షలు విలువ చేసే 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి, రూ ములు, కాంపౌండ్ వాల్ నిర్మించాడు. గతంలో ఇదే విష యంలో అధికారులు హెచ్చరిస్తే వెనక్కి తగ్గి మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. దీనిపై స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకోవాలని ఆయన తన పరి ధిలోని అధికారులను ఆదేశించారు. ఈ విధంగా తహస ీల్దార్ మూడోసారి కబ్జాలపై అధికారులను ఆదేశించడం, వారు వెళ్లి అక్రమ నిర్మాణదారులకు నోటీసులివ్వడం వరకే తప్పా కబ్జాలు మాత్రం ఆగడం లేదు. ఈ కబ్జాల వెనుక అధికారులు, ప్రజా ప్రతినిధుల హస్తం ఉందేమోనన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కబ్జా స్థలంలో మరో రెండు గదులను కూడా సదరు కబ్జాదారు నిర్మించాడు. ప్రస్తుతం రెండుచోట్ల కబ్జా, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. గాగిల్లాపూర్ పరిధిలో ఏడాది కాలంగా రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకోరుల కబంధ హస్తా ల్లోకి వెళ్లాయని చుట్టుపక్కల వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. గతంలో కబ్జాకు గురైన చోట వేసిన ఫెన్సింగ్, బోర్డుల ఆధారంగా తహసీల్దార్, ఆర్డీవోలు విచారణ చేప డితే కబ్జాల పర్వం పూర్తిగా బయటపడే అవకాశం ఉందంటున్నారు.