Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏనుగు అంబారీపై అక్కన్న, మాదన్న, మహంకాళి అమ్మవారి ఘటం
- చిన్న తప్పులు చేసి పెద్ద ముప్పులు తెచ్చుకుంటున్నారు : భవిష్యవాణి మాతంగి వ్యాఖ్యలు
- భారీ బందోబస్తు ఏర్పాటు
- ఆకట్టుకున్న పోతరాజుల వీరంగం, మేళతాళాల వేషధారణలు
నవతెలంగాణ-మెహిదీపట్నం
ఆషాడమాసం బోనాల సందర్భంగా రాష్ట్రం లోనే అంగరంగ వైభవంగా జరుగుతున్న బోనాల జాతర సోమవారం ఘటాల ఊరేగిం పుతో ముగిసింది. అన్ని ఆలయాల నుంచి వచ్చే ఘటలు సాయంత్రం 4:30 నుంచి ప్రారంభమ య్యాయి. ప్రముఖ ఆలయాలైన అక్కన్న, మాద న్న, మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలు పోతరాజుల వీరంగాలు, భక్తులతో కిటకిటలా డాయి. అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం నుంచి ఘటాలు బయల్దేరాయి. ఈ ఘట్టం ప్రారంభోత్సవానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. భక్తులు కరోనా నిబం ధనలకు అనుగుణంగా ఊరేగింపులో పాల్గొనాల న్నారు. ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఘటం ఊరేగింపులో మొదటిసారిగా వచ్చిన ఏనుగుకు ఎలాంటి ఆటకం కలిగించకూడదని సూచించారు. ఘటా ల ఊరేగింపులో భాగంగా ముందుగానే ఉప్పు గూడ మహంకాళి ఆలయం వద్ద నిర్వహించిన భవిష్య వాణి కార్యక్రమంలో మాతంగి భవిష్య వాణి తెలియజేస్తూ.. 'భక్తులారా నేను మిమ్మల్ని చల్లగా చూస్తాను కానీ మీరు చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ పెద్ద పెద్ద కష్టాల పాలవుతున్నారు. ఇప్పుడు వచ్చిన కష్టం కంటే ఇంకా పెద్ద రోగం వచ్చే ముప్పు ఉంది. ఎవరెవరినీ ఎంత వరకు కాపాడాలో నేను కాపాడుతా. నిండుకుండ నిండాక తొలుగక మానదు రా... మీకు ఎలాంటి రోగం రాకుండా నేను చూసుకుంటాను. నా గుడికి వచ్చి బండారి తీసుకుని నుదుట బొట్టు పెట్టుకుని భోజనం చేయకుండా ఉండండి. ఎలాంటి రోగమైనా పారిపోతుంది. నన్ను సాగనంపకుండా మీ ఇంట్లోనే నన్ను పెట్టుకుని పసుపు ముద్దులు చేసుకుని ఒకరికొకరు వాయినాలిచ్చికోండి. మీరు చల్లగా ఉంటారు. శివాలయం పనులు పూర్తి కాకుండా మధ్యలో ఆగి ఉన్నాయి. వాటిని ఉద్దేశించి గుడి చైర్మన్ అడిగిన జవాబుకు సమాధానమిస్తూ.. నాకు కావాల్సినంత గుడి నేను కట్టుకున్నాను రా..' అని పచ్చి కుండపై నిలబడి మాతంగి భక్తులకు అభయమిచ్చింది.