Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గత వారంలో కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి ట్రైన్, ప్లాట్‌ఫాంకి మధ్యలో జారిపడ్డ మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్పీ ఎఫ్ రైల్వే పోలీస్ కానిస్టేబుల్‌ను సోమవారం ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ వారి బృందంతో కలిసి రైల్వే స్టేషన్స్ టెన్త్ ప్లాట్ ఫారం మీద ఉన్న కార్యాలయంలో పూలమాల, శాలువాతో సన్మానించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ కులమతాలకు అతీతంగా తన ప్రాణాలకు తెగించి కాపా డిన దినేష్నీ, 2020లో మరొకరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ డేవిడ్‌ను సన్మానించడం తన బాధ్యత అన్నారు. వీరిద్దరిని పూలమాల, శాలువాతో సన్మానించ డం అంటే వారి విధుల పట్ల అంకితభావంతో పనిచేసిన వారి బాధ్యత ఇంకా పెరిగాయి వాటిని గుర్తు చేస్తున్న ట్టుగా అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, రామ్మోహన్, తెలంగాణ పేపర్ చీఫ్ ఎడిటర్లు, తదితరులు పాల్గొన్నారు.