Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 1 కోటీ 30 లక్షలతో 2020లో పనులు ప్రారంభం ఏడాదిపూర్తయినా పూర్తికాని వైనం
- త్వరగా పూర్తి చేయాలంటున్న స్టూడెంట్స్
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీకి చెందిన కావేరి హాస్టల్ మరమ్మతుల పనులను రూ. 1 కోటీ 30 లక్షలతో ఇప్పటికే చేపట్టారు. కొత్తగా వాటర్ పైప్‌లైన్, బాత్ రూమ్స్, డ్రయినేజీ, వైరింగ్, పాల్ సీలింగ్ రూఫ్ మార్ఫింగ్, పెయింటింగ్, వాటర్ ట్యాంకుల ఏర్పాటు వంటి పనులు జులై 2020లో చేపట్టారు. ఏడాది పూర్తయినా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 70 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా 30 పనులు చేయాల్సి ఉండగా వాటిని త్వరలో పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికైనా హాస్టల్ రిపేరింగ్ పనులు పూర్తి చేయాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.
మరోవైపు ఓయూ గెస్ట్ హౌజ్‌ను కూడా రూ 75 లక్షల రూసా నిధులతో వాటర్ ఫ్రూఫింగ్, లీకేజీలు తదితర మరమ్మతులు చేపట్టి రెండేండ్లు గడుస్తున్నా ఇంకా 20 శాతం పనులు మిగిలే ఉన్నాయి. దీంతో గెస్ట్ హౌజ్‌కు రావాల్సిన ఆదాయం కొంత మేరకు కోల్పోయినట్టేలనని ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా వర్సిటీ కాంపౌండ్‌వాల్ గోడలు కొన్నిచోట్ల కూలిపోయాయి. కొన్నిచోట్ల గ్రౌండ్లోకి చొరబడేందుకు గోడలకు గుర్తు తెలియని వ్యక్తులు, చుట్టుపక్కలవారు రంద్రాలు వేశారు. ఎసీసీస గేట్‌కు మరమ్మతులు చేపట్టి నెలరోజులు గడుస్తున్నా ఆ పనులు కూడా స్లోగానే నడుస్తున్నరు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు మాణికేశ్వరినగర్ వద్ద, మెయిన్ రోడ్డువద్ద కూలినగోడను పునర్మించలేదు. ఓయూ గ్రౌండ్లోకి రావడానికి అనువుగా ఉన్నందున రాత్రిపూట వర్సిటీ గ్రౌండ్లోకి పోకిరీలు వచ్చి సిగరెట్లు కాల్చడం, మందు సేవించడం వంటివి చేస్తున్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. మెయిన్‌రోడ్‌పై స్ట్రీట్‌లైట్స్ వెలుగకపోవడంతో రాత్రిపూట ఇక్కడ వర్సిటీ చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.
అధికారులకు అయితే శరవేగంగా
ఓయూలో ప్రధాన అధికారులకు సంబంధించిన ఎలాంటి పనులున్నా ఆఘమేఘాల మీద ఉత్తర్వులను జారీచేసి రోజుల వ్యవధిలోనే పనులు పూర్తి చేసు కుంటున్నారు. అదే వర్సిటీకి, విద్యార్థులకు సంబంధించిన పనులు మాత్రం వివిధ రకాల సాకులు చెప్తూ త్వరగా పూర్తి అయ్యేలా చూడకపోవడం గమనార్హం. అధికారులు తమ పనుల్లో చూపిన శ్రద్ధను వర్సిటీ పనుల్లో మాత్రం చూపడం లేదన్న విమర్వలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఓయూ హాస్టల్‌తోపాటు వివిధ మరమ్మతు పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.