Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
ఆగస్టు 9న భారత రక్షణ దినం పాటిస్తూ అన్ని ప్రాం తాల్లో చేసే దీక్షలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డికి సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కీసర్ నర్సిరెడ్డి సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తు ప్రజలపై భారాలు మోపుతు, అధిక ధరలు పెంచుతు ప్రజలను పట్టించుకోవడం లేదు అన్నారు. ఆగష్టు 9 నుండి ఈనెల చివరికి చేసే దీక్షలను విజయవంతం చేయాలని, ఎల్బీనగర్లో జరిగే దీక్షను జయప్రదం చేయాలని కోరారు.