Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను గుర్తించడానికి ఎమ్మార్వో గౌతమ్ కుమార్తో కలిసి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించాలని కోరారు, అంతేకాకుండా డివిజన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని లేఅవుట్ చేస్తూ విక్రయం చేస్తున్నారని ఎమ్మార్వోకి కార్పొరేటర్ వివరించారు. ముఖ్యంగా అ స్థలాలకు రక్షణగా కంచే వేసి బోర్డులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేశారు. అంతే కాకుండా ప్రభుత్వ స్థలాలను నిర్లక్ష్యంగా వదిలేస్తే భవిష్యత్తులో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఎమ్మార్వోకి వివరించారు. ఈ ప్రభుత్వ స్థలాల్లో సామాజిక భవనాలు, ఇతరత్రా అవసరాలకు భవనాలు నిర్మించి బస్తీ మరియు కాలనీవాసులకు ఉపయోగపడే విధంగా కషి చేయాలని కోరారు. దీనిలో భాగంగా డివిజన్లోని ప్రభుత్వ స్థలాలను ఎమ్మార్వోకిి చూపించారు. అధికారులతో కలిసి చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ పాదయాత్ర చేస్తూ పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన ఎమ్మార్వో ప్రభుత్వ స్థలాలను తప్పకుండా పరిరక్షిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయరు ప్రశాంత్, ఆర్ఐ షాహిన్, వీఆర్ఏ సుమన్, టీిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, వీబీ నరసింహ, ఏదుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, శామ్, వేణు గోపాల్ రెడ్డి, గూడూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.