Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్‌పేట్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పండగలకు పెద్దపీట వేశారు అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కె పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయం బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చే పారితోషకం రూ.1,30,000 చెక్కును డివిజన్ అధ్యక్షులు మురుకుంట్ల అరవింద్ శర్మ, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్‌లకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండగ చాలా ప్రత్యేక మైన పండగ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పండగలకు పెద్ద పీిట వేశారు అని, అందులో భాగంగానే బోనాల పండగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించ డంతో పాటు అధికారికంగా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. బోనాల పండగ తెలంగాణ ప్రజల సంస్కతి, సంప్రదాయాలకు అద్దంపడుతుంది అన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో కనుమరుగయిన తెలంగాణ సంస్కతి సంప్రదాయలు తెలంగాణ ప్రభుత్వంలో పూర్వ వైభవం వచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండ్ర శ్రీనివాస్, నాయకులు సాజీద్ పాల్గొన్నారు.