Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు చెర్ల ఆంజనేయులు యాదవ్ పార్టీ అభివద్ధి కోసం నిరంతరం కషి చేశారని, ఆయన చేసిన సేవలు మరువలేనివని టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ నగర టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆంజనేయులు యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ గ్రామ పంచాయతీగా ఉన్న నాటి నుండి కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆంజనేయులు యాదవ్ విశేషంగా కషి చేశారని అన్నారు. కరోనా బారిన పడి అకాల మరణం చెందడం పార్టీకి తీరని నష్టమని అన్నారు. ఆంజనేయులు యాదవ్ కుటుంబాన్ని పార్టీ అన్ని రకాలుగా అదుకుందని, ఆయన సేవలను గుర్తిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు కొత్త చందర్‌గౌడ్, పద్మారెడ్డి సింగిరెడ్డి, చీరాల నర్సింహ, సీసా వెంకటేష్ గౌడ్, సుమన్ నాయక్, కోఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న, సహకార బ్యాంకు డైరెక్టర్ జడిగే రమేష్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నేతలు కాటపల్లి రాంచంద్రారెడ్డి, మోదుగు శేఖర్‌రెడ్డి, కొత్త రవిగౌడ్, కపాసాగర్, జె.రాములు, బొమ్మకు విశ్వనాథ్, మీసాల కష్ణ, తోటకూర రవీందర్ యాదవ్, రాసాల మహేష్ యాదవ్, పీవీ సురేష్, ఉప్పరి విజరు, కిర్తన్ రెడ్డి, జక్కా ప్రవీణ్‌లు పాల్గొన్నారు.