Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
ఈనెల 9న జరుగు భారత్ రక్షణ దినాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు గ్రూప్ మీటింగ్లో తెలియజే శారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తూ, ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని, ఆగస్టు 9న భారత్ రక్షణ దినాన్ని నిర్వహించాలని కార్మికు లకు విజ్ఞప్తి చేశారు.
ఆటో నగర్లోని కార్మికుల కరపత్రాలు పంపిణీ చేసి గ్రూప్ మీటింగ్ ద్వారా సీిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి తెలియజేయడం జరిగింది. రైతు, కార్మిక వ్యతిరేక వ్యవసాయ చట్టాలను లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రజావ్యతిరేక విద్యుత్ సవరణ బిల్లు ఆపాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ఆపాలని, సహజ వనరుల లూటీ నిలుపు చేయాలని, మంగళవారం ఆటో నగర్లోని బీఎంపీఎస్ ముందు కార్మికులు కార్యక్రమం నిర్వహించారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో ఆడంబరంగా ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీ కార్పొరేట్ వర్గాలు రుణాల పేరుతో కాజేశాయని, ఈ కాలంలో శత కోటీశ్వరులు సంపద 30 శాతంగా పెరిగిందన్నారు. పై స్థాయిలో ఉన్న వంద మంది కార్పొరేట్ వర్గాల సంపద సుమారు 13 లక్షల కోట్లకు పెరిగిందని, పేదలు మరింత పేదలు అయ్యారని అన్నారు. పాలకులు కాకులను కొట్టి సామాన్యులను ఆకలి బాధలకు గురిచేసి కార్పొరేట్ కోటీశ్వరులు సంపద కేంద్ర బీజేపీి ప్రభుత్వం అన్నారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఇప్పటికే సమ్మెలు, వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం జరిగింది.
ఢిల్లీ సరిహద్దుల ముట్టడి రూపంలో వీరోచితంగా పోరాడుతున్నారు. రైతాంగం గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న రైతాంగ పోరాటం ఉద్యమాన్ని చీల్చేందుకు బీజేపీ వేసిన పాచికలు పారలేదు. కార్మిక వర్గం రైతు వ్యవసాయ కార్మికులు మరింత దఢంగా పోరాడుతున్నారు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ విద్యుత్ రక్షణ రంగాలలో సమ్మె పోరాటాలు సాగుతున్నాయి. తక్షణమే ప్రైస్ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహ రించుకోవాలని చట్టాలని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.