Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బోన్, జాయింట్ డే
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా(కోవిడ్-19) పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో అనేక రకాల అరోగ్య సమస్యలు స్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఎముక, కీళ్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నేడు బోన్, జాయింట్ దినోత్సవం సందర్భంగా ఎముకలు, కీళ్ల సమస్యల గురించి కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్స్ చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్. సాయిలక్ష్మణ్ అన్నె వివరించారు. ఆ విషయాలు ఆయన మాటాల్లోనే...
కోవిడ్-19 వైరస్ కారణంగా శరీరంలో ఇప్పుడు అనేక వ్యవస్థలు సక్రమంగా పని చేయలేకపోవడానికి కారణమవుతోంది. ఊపిరితిత్తులే కాకుండా వివిధ అవయవాలు కూడా దెబ్బతింటున్నాయి. అజీర్ణం, అలసట, గుండె, కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పని చేయలేకపోతున్నాయి.
కోవిడ్ వచ్చిన వెళ్లిన తర్వాత అనేక రకాలైన సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో కాళ్లు, చేతులు, కీళ్లలో వాపులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని రియాక్టివ్ ఆర్థ్రాల్జియా అని అంటారు. అంటువ్యాధుల తర్వాత సాధారణంగా రోగుల్లో ఇలాంటివి సంభవిస్తాయి. శరీరంలో వైరల్ సంక్రమణ తగ్గిన కొన్ని వారాల తర్వాత ఇది ప్రారంభం అవుతుంది. వాపురావడం, కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతాయి. అయితే ఇక్కడ కండరాల-అస్థిపంజర వ్యవస్థ ఏదైన భాగం ప్రభావితమవుతుంది. రియాక్టివ్ ఆర్థ్రాల్జియా చికెన్ గున్యా జ్వరం, డెంగ్యూ జ్వరం వచ్చి పోయిన తర్వాత సాధరణంగా వస్తాయి. ఇది కోవిడ్ తగ్గిన రోగుల్లో 20-30శాతం మంది రోగుల్లో గమనించబడింది.
చికిత్స - సమస్యలు
రియాక్టివ్ ఆర్థ్రాల్జియా అభివద్ధికి అనేక కారణాలు ఉన్నాయి. కారకాలు చూస్తే వ్యాధి నుండి ఉత్పన్నమవుతుంది. సంక్రమణ చికిత్సకు సంబంధించినవి, చివరకు మెడికల్ కొమొర్బిడిటీల ఉనికి రియాక్టివ్ అభివద్ధిని ప్రభావితం చేస్తుంది. కొన్ని కారకాలను విడుదల చేయడం వల్ల వచ్చే మంట వాపు, నొప్పికి దారితీస్తుంది. స్టెరాయిడ్లను ఎక్కువగా వాడటం వల్ల ఎముకల్లో ఉండే ఖనిజ సాంద్రతను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు వస్తాయి.
యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచడంతో
కోవిడ్ వచ్చిపోయిన తర్వాత ఎముక, కీళ్ల సమస్యల ప్రభావానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రికవరీని గణనీయమైన స్థాయిలో మెరుగుపరచొచ్చు. వీటి గురించి తెలుసుకోవడానికి ఎముకల, కీళ్ల వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. వ్యాయామం చేయడానికి ఒక ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో అన్ని రకాల వ్యాయామాలు చేయాలి. ఖచ్చితమైన ఆహార నియమావలి ఉండాలి. రోగికి అనుగునంగా ఆహార ప్రణాళికను సిద్దం చేయాలి.