Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రూ. 2.86 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-హైదరాబాద్
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అల్మాస్గూడలోని 24,25వ డివిజన్లలో మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 24వ డివిజన్లోని రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ ముత్యాల లలితా కృష్ణ అద్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అల్మాస్ గూడ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి రూ. 2 కోట్ల 86 లక్షల నిధులు కేటాయించామని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దళితుల బాగుకోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండవద్దన్న ఉద్దేశంతో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్లు ఏనుగు రాంరెడ్డి, సంరెడ్డి, స్వప్న వెంకట్ రెడ్డి, దీపిక శేఖర్ రెడ్డి, బిమిడి స్వప్న జంగారెడ్డి, పి. సుదర్శన్ రెడ్డి, యాతం పవన్ యాదవ్, నాయకులు ఈఎల్ వి.అశోక్, మాజీ సర్పంచ్ బొర్ర జగన్ రెడ్డి, కే.నాగేందర్ గౌడ్, సంతోష రెడ్డి, తుపాన్ రెడ్డి, మాధవ రెడ్డి, ఏఈ రాంప్రసాద్ రెడ్డి, మహిళా నాయకురాలు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి రూ. 15 కోట్లు
బోనాల పండుగ సందర్భంగా దేవాలయాలకు సీఎం కేసీఆర్ రూ. 15 కోట్ల నిధులు విడుదల చేశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బోనాల పండుగకు మంజూరైన డబ్బులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి రూ.11లక్షలు, రంగారెడ్డి జిల్లాలోని 349 దేవాలయకు రూ. కోటి 9 లక్షల 33 వేలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో మేయర్ పారిజాత నరసింహ్మ రెడ్డి, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఆలయాల ప్రతి నిధులు పాల్గొన్నారు.