Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్‌బషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఉచిత కరెంటుపై నాయీ బ్రాహ్మణులు, రజకుల సందేహాల నివృత్తికి బీసీ వెల్ఫేర్, ఎలక్ట్రిసిటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న సెలూన్లు, లాండ్రిల రిజిస్ట్రేషన్లు, 250 యూనిట్ల కంటే ఎక్కువ బిల్లు వస్తే ఏ విధంగా చెల్లింపు, మోడల్ సెలూన్ల ఏర్పాటు, కమర్షియల్ మీటర్లు, కొత్త మీటర్ల ఏర్పాటు వంటి సందేహాలను నాయీ బ్రాహ్మణులు, రజకులు అధికారుల దృష్టికితీసుకవచ్చారు. దీంతో వారి సమస్యలను అధికారులు నివృత్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. తరతరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న లక్షలాది రజక, నాయీబాహ్మణ కుటుంబాలకు ఈ పథకం ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఎం.ఎస్.ఝాన్సీరాణి, ఎలక్ట్రికల్ ఏడీలు రాజలింగం, లక్ష్మణ్, డీఈలు శ్రీనాథ్‌రెడ్డి, భిక్షపతియాదవ్, ఓంమణికంఠ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు రేనయ్య, మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పరమేష్, చైర్మెన్ రవి, కోశాధికారి మహేందర్, గౌరవ అధ్యక్షులు యాదగిరి, సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు, దుండిగల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం.కుమార్, గాంధీ వాషర్మెన్ కో ఆపరేటివ్ సోసైటి గౌరవ అధ్యక్షులు జి.బాలయ్య, ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.