Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ పరిధిలో అప్పటి రాజ పాలకుల ఏలుబడిలో ఈ జాగిర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అర్చకులు, పూజారులను నియమిం చారని వి.నర్సింగ్రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం లభించక ముందు నుంచి ఈ పూజారులు, అర్చకులు తమ ఆచారాలు విధి విధానాలతో వెంకటేశ్వరునికి పూజలు జరుపుకునేవారనీ, రాను రాను ఈ గుడికి కొందరు ఎండోమెంట్ వాళ్లను తెచ్చి అర్చకుల పూజారులను, గుడి చుట్టుపక్కల కొన్ని ఇండ్లపై కేసులు వేసి కోర్టు చుట్టూ తిప్పుతూ బాధ పెడు తున్నారని తెలిపారు. ఒకప్పటి అల్వాల్ గ్రామం జాగీర్దార్ల హయాంలో స్వాతంత్య్రం ముందు నుండే స్థిర నివాసం ఏర్పరచుకుని నివసిస్తున్నారనీ, జాగీర్దార్ల హయాంలో వారి ప్రభుత్వంలో తమ నాన్న స్వర్గీయ ధన్సింగ్ తాసీల్దార్ ఆఫీస్లో గుమాస్తాగా నియమించబడ్డాడనీ, తర్వాత జాగీర్దార్ వారసుల వద్ద నుంచి తమ అమ్మ లక్ష్మమ్మ కొనుగోలు చేసినట్టు తెలిపారు. అప్పటి నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నామని తెలిపారు. 1998లో గుడిలో ఉన్న జాగిరి దారులను అర్చకులను కోర్టులో వ్యా జ్యాలు చేసి తిప్పుతున్నారన్నారు. అల్వాల్ గ్రామం మొత్తం విశాలమైనదిగా ఉండి నలుమూలలా విస్తరించి ఉన్నదనీ, గ్రామంలో ఎన్నో భవనాలు ఉన్నాయి కానీ నామ మాత్రా నికి కొంతమందిని దేవాలయ శాఖ వారు వేధిస్తున్నారనీ, ఈ విషయమై ఎన్నో సార్లు అధికారులకు విన్నవిం చుకుంటున్నా ఫలితం లభించలేదని తెలిపారు. ఇప్పుడు వీటిలో నివసిస్తున్న వారు ఐదు తరాలుగా నిర్వహిం చుకుంటూ ఈ భవనంలో ఉంటున్నారనీ, భవనాలు ఉన్న ఇంటి నెంబర్ 7-30 పైన కోర్టు నుంచి 2020 నవంబర్ నుంచి అద్దె విధించే విధంగా కోర్టు దారిని కోరగా కోర్టు నెలకు రూ.15000 విధించిందనీ, తాను ఒక సామాన్య ఉపాధ్యాయుడుగా పదవి విరమణ పొంది తనకు వచ్చే పెన్షన్ పై కుటుంబం మొత్తం ఆధారపడిందనీ, ఈ సందర్భంలో పెన్షన్ నుంచి ప్రతి నెలా రూ.15000 ఈ పాత ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి ఉందనీ, దీన్ని పరిశీలించి ఎండోమెంట్ అధికారులు తగు న్యాయం చేసి అందరితోపాటు తమకూ ఈ జాగీర్ అల్వాల్లో నివసించడానికి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు.