Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు భేష్
- హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
- మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్
మన పోలీస్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పని చేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళ వారం సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలోని మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవన సముదాయాన్ని మంత్రి తలసాని శ్రీనివా స్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారనీ, నగరంలో ఎక్కడ చిన్నపాటి గొడవ జరిగినా కేవలం 5,10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారన్నారని తెలిపారు. పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మొదటి నుంచీ ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన నాటి నుంచి నేటి వరకు పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని చెప్పుకొ చ్చారు. ఏ రాష్ట్రంలోనైనా పోలీస్ వ్యవస్థ పని తీరు ఆధారంగానే ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందనే నమ్మకం ప్రజలల్లో ఉంటుందన్నారు. పోలీసులు అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఏర్పడిందనీ, ఎంతో ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నార న్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఫిర్యాదు దారుడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటే ఎంతో భయపడే వారనీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపో యాయని తెలిపారు. మహిళలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 331 షీటీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎక్కడైతే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయో అక్కడ అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు. నేడు హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నారంటే దానికి కారణం మన పోలీసులే అన్నారు. పోలీసులంటే ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందనీ, పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తమకు న్యాయం జరుగుతుందనే భరోసాతో ప్రజలు ఉన్నారన్నారని చెప్పారు. నగరంలో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో పోలీసులు 24 గంటల పాటు పనిచేసి జాతర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోశించారన్నారు. ఇక ట్రాఫిక్ విషయం మనందరికీ తెలిసిందే అనీ, ఉదయం లేచిన మొదలు రాత్రి వరకు నగర రోడ్లన్నీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోతాయన్నారు. ఇలా ంటి మహానగరంలో మన ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా ట్రాఫిక్ జాం కాకుండా నిరంతరం పని చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కొల్లేటి దామోదర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అడి షనల్ కమిషనర్ సర్ చౌహాన్, అడిషనల్ కమిష నర్ / క్రైం, షికా గోయల్, జాయింట్ కమిషనర్ అవినాష్ మొహంతి, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, స్థానిక కార్పొరేటర్ చీర సూచిత్రా శ్రీకాంత్, ట్రాఫిక్ ఏసీపీ వినోద్ కుమా ర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్తయ్య, ఎస్సై శంకర్, కురుమన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.