Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దేశ రాజధాని ఢిల్లీలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగా పాణి నాయకత్వంలో సికింద్రాబాద్ నియోజక వర్గ, నాయకులు కార్యకర్తలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నయవంచక కేసీఆర్ పాలనలో అంతమొందించడంలో భాగస్వాములు కావాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని అని వారు తెలిపారు. అందరూ కార్యకర్తలు కలిసిమెలిసి పార్టీ బలోపేతానికి కషి చేయాలని కోరారు. ఈసందర్భంగా కార్యకర్తలు శాలువాలతో , గజమాలతో సన్మానించారు. అనంతరం కిషన్ రెడ్డి గారి చిత్రపటాన్ని (సారంగ పాణి సౌజ్యంతో) అందరూ కలిసి బహుకరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాకార్యదర్శి మేకల సారంగపాణి, ఉపాధ్యక్షులు రాచమల్ల కష్ణమూర్తి, అధికార ప్రతినిధి ప్రభు గుప్తా, ఓబీసీ మోర్చా కోశాధికారి స్వయంప్రకాష్, మల్లేష్, ప్రకాష్ గౌడ్, గణేష్, ఆకుల శ్రీనివాస్, సూర్య ప్రకాష్ సాయి దత్తు, కన్నాభిరాన్, నీలం శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు హనుమంతు రాము, శ్రీధర్ రావు, సుధాకర్ క్యాటరింగ్ రాజు. రామాంజనేయులు పాల్గొన్నారు.