Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట రాజీవ్గృహకల్పకు చెందిన రత్నకుమారి కుమారుడు ప్రకాష్ (24) జూన్ 14వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో విజయవాడకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. అయితే జూన్ 25న తన తండ్రి కృష్ణారావు అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలియజేసేందుకు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. అతని ఆచూకీ కోసం చుట్టూ పక్కల, బంధువుల వద్ద ఆరా తీయగా ఎలాంటి ప్రయోజనం లేదు. దీంతో విజయవాడలో అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియజేయడంతో ఫోన్ చేయగా సరిగా సమాధానం చెప్పడం లేదు. అతని తల్లి రత్నకుమారి మంగళవారం జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.