Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
పోలీసుల కన్నుగప్పి వరుసగా బైక్ దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్తుడిని అరెస్టు చేసి పోలీసులు మంగళవారం రిమాండ్ కు తరలించారు. ఏఎస్ఐ అబ్దుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇముల్ నర్వ గ్రామానికి చెందిన కొర్ర వినోద్ కుమార్ కొంత కాలంగా బైకులను దొంగతనం చేస్తూ అదే తన వత్తిగా మలచుకున్నాడు. గతంలో షాద్నగర్లో దొంగతనం చేసి పట్టుబడి జైలుకు సైతం వెళ్లి గత నెల 9న విడుదలయ్యాడు. తిరిగి మూడు రోజులు ఖాళీగా ఉన్నాడో లేదో కొత్తూరు వై జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్ ముందు ఉన్నటువంటి బైక్ను దొంగతనం చేశాడు. అనంతరం వారం రోజుల కింద అదే కొత్తూరులోని రాఘవేందర్ హౌటల్ ముందు పార్కు చేసిన బైకు, కొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ఉన్న మరొక బైకును దొంగిలించి తప్పించుకొని తిరుగుతున్నాడు. నిఘా పెట్టిన క్రైమ్ పోలీసులు సోమవారం ఇముల్నర్వ చౌరస్తాలో అనుమానాస్పదంగా బైకుకు నెంబర్ ప్లేట్ లేకుండా కనిపించడంతో అతన్ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. విచారించగా వరుస చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, మూడు బైకులను స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరిలించారు. ప్రతిభ చూపిన ఏఎస్ఐ అబ్దుల్లా, కానిస్టేబుల్స్ నరేందర్, వినోద్, బలరాంను సీఐ అభినందించారు.