Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
జీహెచ్‌ఎంసీి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.24000లు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ పోచమ్మ టెంపుల్ లో మున్సిపల్ కార్మికులతో ఈనెల తేది 7వ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు మహా ధర్నా ను లోయర్ ట్యాంక్ బండ్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద జీహెచ్‌ఎంసీి కార్మిక సంఘాలతో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పర్మినెంట్ చేసేలోపు రూ.24000 పెంచాలని, తెలంగాణ తొలి పీఆర్‌సీి లో ఉద్యోగ ప్రయోజనాలు కాపాడే విధంగా జీవో లను సవరించాలని. జీహెచ్ఎంసీలో వివిధ కేటగిరిలో పనులను ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, ప్రయివేట్ వ్యక్తుల అజమాయిషి నివారిం చాలని. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికు లకు ఉద్యోగ భద్రత కల్పించాలిని వారు అన్నారు. జీహెచ్‌ఎంసీి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందిని హైకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ చేసి కార్మికులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని మాస్క్‌లు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, రక్షణ సౌకర్యాలు కల్పించాలని మరణించిన కార్మికుడికి దహన సంస్కారాలకు రూ.30000లు ఇవ్వాలని, 60 సంవత్సరాలు మీరిన కార్మికులను తొలగించరాదని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ. వారసులు ఉంటే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్‌గా 10లక్షల రూపాయలు వారి వారసులకు ఒక్కరికి ఉద్యోగం కల్పించాలి వారసులు లేని వారికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని కరోనా సోకి మరణించిన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం చెల్లించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు 25 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్స్ ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కరపత్రాన్ని విడుదల చేశారు. లేనియెడల జిహెచ్ఎంసి కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ ఎల్లమ్మ సువర్ణ సాలమ్మ మల్లమ్మ అనిత రాములమ్మ బారు అమ్మ దేవమ్మ. సంతోష కాల్ అమ్మ, కష్ణమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.