Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మల్కాజిగిరి
ఆషాడ మాస బోనాలు సందర్భంగా గురువారం గౌతమ్‌నగర్ డివిజన్లోని సాయినగర్ కార్పొరేటర్ కార్యాలయంలో మేకల సునీతరాముయాదవ్ బోనాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవాలయ కమిటీ సభ్యులకు డివిజన్ లోని 17 దేవాలయాలకు సంబంధించి 7 లక్షల 2వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలో ఈ సంవత్సరం బోనాలు ఉత్సవాలు శాంతి యుత వాతావరణంలో జరిగాయన్నారు. ఈ బోనాల ఉత్సవాల నిర్వహణకు పలు దేవాలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.