Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
కరోనా కారణంగా పాఠశాలలు తెరవక విద్యార్థులు చదువులకు దూరమయ్యారని పీర్జాదిగూడ నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఏవి కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి తన విద్యా సంవత్సరంను కోల్పోవద్దనే ఉద్దేశంతో టీ సాట్ ద్వారా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తుందని ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, అలాగే నోట్ పుస్తకాలను ఏవి కన్స్ట్రక్షన్స్వారి తరుపున ఉచితంగా పంపిణీ చేయుచున్నామని, ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, కౌడే పోచయ్య, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎంపల్ల అనంత రెడ్డి, దొంతిరి హరి శంకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, టీఅర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, మాడుగుల చంద్రారెడ్డి, కుర్ర శ్రీకాంత్‌గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, బండి సతీష్‌గౌడ్, మనోరంజన్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, నిర్మల, రాకేష్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుశీల, ఉపాధ్యాయులు,పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.