Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ క్రికెట్ టోర్నమెంట్‌ను ఈనెల 7న నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ ఇంద్రన్న ఒక ప్రకటన లో పేర్కొన్నారు. వెస్ట్ మారేడు పల్లి మున్సిపల్ గ్రౌండ్ లో ఈ టోర్నమెంట్‌ను జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాకౌట్ మ్యాచ్‌లని, పాల్గొనే జట్లు ఎలాంటి ఎంట్రీ ఫ్రీజు లేదన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ 6. వేలు, రెండో బహుమతి రూ. 3 వేల నగదుతో పాటుగా ట్రోఫీలు అందజేయనున్నాట్లు ఇంద్రన్న చెప్పారు.