Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ఇటీవల ప్రకటించిన సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో వాసవి పబ్లిక్ స్కూల్ విజయఢంకా మోగించింది. గత పదేండ్ల నుంచి 100 శాతం ఫలితాలతో తమ పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారని స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ రావు తెలిపారు. స్కూల్ తరపున 81 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, ఇందులో 9 మంది (సీవీఎస్ కృతి, దొంగ్వేశ్వర సుదీక్ష, ఆయా రితేష్ కుమార్ పారిక్, క్రమటం వెంకట అనిరుధ్, కేపీఎస్ వర్షణ, షేక్ మహమ్మద్ పాంగిర్ రౌహన్, రోగిత్ సాయి శరణ్ బి, చుండూరి గోపిక మనస్విని, కోనేరు నాగ మన్విత) 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆమె అభినందనలు తెలిపారు.