Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గంగా ఎంక్లేవ్లో డ్రయినేజీ అభివృద్ధిపై జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, జలమండలి అధికారులతో కలిసి పర్యటించి వర్షపు నీటి నాలాను పరిశీలించారు. ఈసందర్భంగా ఓపెన్ నాలాలో మురుగు చేరడంతో తరచూ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. దీంతో స్పందించిన ఆయన నూతన డ్రయినేజీ లైన్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రయినేజీ నిర్మాణానికి అవసరమైన వ్యయ ప్రణాళికలు రూపొందించి పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, జలమండలి డీజీఎం రాజేష్, ఎఈ సురేందర్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.