Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
నిరుద్యోగ సమస్య రూపు మాపడమే లక్ష్యంగా ప్రజా జీవన రైతు పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండి శోభన్ బాబు అన్నారు. నిరుద్యోగం, వ్యవసాయం, విద్యా, వైద్యం, సంక్షేమం ప్రధాన ఎజెండాగా పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఈమేరకు గురువారం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మట్లాడుతూ పాలక పార్టీలు జీవోలు లేని హామీలు ఇస్తూ ప్రజల్ని మభ్య పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో నియంతత్వ పాలన సాగుతుందని, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి అమలు చేయలేదన్నారు. నిరుద్యోగానికి ప్రధాన కారణం పదవీవిరమణ వయసు పెంచడమేనని, తాము అధికారంలోకి వస్తే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 57కు తగ్గిస్తామన్నారు. ప్రజలకు మేలు చేసే ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 2023 ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ కోశాధికారి రవి వారణాసి, సత్తిరెడ్డి, సుడి నరేందర్ రెడ్డి, డాక్టర్ నూకల మల్లికార్జున్, దండే లక్ష్మి, సునీత రాథోడ్, రెడ్డిమల్ల కనకరాజు తదితరులు పాల్గొన్నారు.