Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉప్పల్
మేడ్చల్‌లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మేడ్చల్‌లోని ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం అమానుషమని సీపీఐ(ఎం) ఉప్పల్ కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ అన్నారు. దాడికి నిరసనగా గురువారం రామంతపూర్, రాజేంద్రనగర్‌లో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్. సంతోష్‌ను చెయ్యి విరిగేలా గాయపర్చారని అన్నారు. దాడిచేసిన టీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఉప్పల్ సర్కిల్ కమిటీ నాయకులు, వై. వెంకటేశ్వర్లు, పెద్ద స్వామి, యాదగిరి, ఎస్కె. సుభాని, డీవైఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్, తుకారాం, రాపోలు శ్రీనివాస్, సుహాన్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.