Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెనోవా హాస్పిటల్లో హెల్త్ క్యాంప్
నవతెలంగాణ-హైదరాబాద్
ఆగష్టు ఫస్టు నుంచి 7 వరకు కొనసాగే తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని లంగర్హౌజ్లోని రెనోవా హాస్పిటల్లో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న తల్లులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సలహాలు, సూచనలు అందజేశారు. గైనకాలజిస్టు
డా. పద్మావతి కపిల తల్లి పాల విశిష్టతను తెలియజేశారు. శిశువుకు తల్లిపాలే సురక్షితమని, ఇది అనాదిగా కొనసాగుతున్న ప్రక్రియ అని తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థతో పలు ఇతర అంతర్జాతీయ సంస్థలు పుట్టిన శిశువులకు ఆరు నెలలు వచ్చే వరకు కేవలం తల్లి పాలు మాత్రమే అందించాలని పేర్కొంటున్నాయని తెలిపారు. తల్లిపాలలో 4 శాతం కొవ్వు, 0.8 శాతం ప్రోటీన్, 7 శాతం కార్భౌ హైడ్రేట్ (లాక్టోస్) నీరు ఉంటాయని తెలిపారు. ప్రతి 100 మిల్లీ లీటర్ల తల్లి పాలలో 60-75 కాలరీల శక్తి ఉంటుందన్నారు. తల్లి పాలు సంపూర్ణ పోషకాలతో కూడిన ఆహార పదార్థం కాబట్టి అనంతరం కూడా రెండేళ్ల వరకు ఇతర ఆహార పదార్థాలతోపాటు తల్లిపాలు ఇచ్చే ప్రక్రియను కొనసాగించవచ్చన్నారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల్లో తల్లిపాలు ఇవ్వడం ఎంతో సురక్షితం అన్నారు. తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా అన్న ప్రశ్నలకు నిపుణులు సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అయితే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వారిచ్చే పాలలో కొవిడ్ నుంచి కాపాడే యాంటీ బాడీలు ఉండి అవి కూడా శిశువుకు చేరుతున్నాయని, తద్వారా చిన్నారులకు కొవిడ్ రాకుండా రక్షణ ఏర్పడుతోందని వివరించారు. అందుకే వీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చని ఆమె సూచించారు.