Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఆన్లైన్ యాప్ ద్వారా వాట్సాప్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహి స్తున్న ఆర్గనైజర్ షేక్ సాదిక్‌ను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. గురువారం ఎల్బీ నగర్లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో నిందితుడి వివరాలను మీడి యాకు వెల్లడించారు. సరూర్‌నగర్, తపోవన్ కాలనీకి చెందిన షేక్ సాదిక్ ఇతని స్వస్థలం అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా యాప్‌లను సబ్‌స్క్రైబ్ చేసుకొని బుకీల నుండి ఐడీ, పాస్వర్డ్ తీసుకుంటు, ఆ తరువాత సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ ఉన్న ఫంటర్స్తో బెట్టింగ్ లకు పాల్పడుతున్నాడు. మ్యాచ్ జరిగేటప్పుడు లింకులను ఫంటర్స్‌కు పంపించి బెట్టింగులకు పాల్పడుతున్నాడు. ఫంటర్స్ నుండి డబ్బులు వసూలు చేసి ఆన్లైన్లో బూకీ లతో నేరుగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. టాస్ విన్నింగ్ నుండి సుమారు 95 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీ సీజ్ చేసామని, రూ.15 లక్షల 70వేల నగదు, 4 మొబైల్ ఫోన్లు, 28 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్గనైజర్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశామన్నారు. టాస్ విన్నింగ్ నుండి మొదలు పెడితే మ్యాచ్ ముగిసే వరకు బాల్ టూ బాల్ బెట్టింగ్‌లు నిర్వహించేవారని, ఫంటర్స్ బెట్టింగ్‌లో గెలిస్తే వారి నుండి 30 శాతం కమిషన్ కూడా తీసుకునేవాడని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ల మధ్య బుధవారం జరిగిన టీ 20 మ్యాచ్‌కు బెట్టింగ్ పాల్పడుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం అందుకుని అతన్ని అదుపులోకి తీసుకుని మొత్తం అతని వద్ద నుండి రూ.95,33,603 విలువ గల నగదు వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్ఓటీ డీసీపీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఎస్ఐ అవినాష్ బాబు తదితరులు ఉన్నారు.