Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్‌పేట్
అక్రమ మద్యం డంపు చేసి విక్ర యిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో చోటు చేసు కుంది. రంగారెడ్డి జిల్లా ప్రొహి బిషన్, ఎక్సైజ్ అధికారి సరూర్ నగర్ రవీందర్రావు తెలిపిన వివరాల ప్రకారం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సరూ ర్ నగర్ నేతత్వంలో డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ సరూర్‌నగర్, ఎక్సైజ్ స్టేషన్ సరూర్‌నగర్ అధికారులు, సిబ్బంది కలిసి ఈనెల 4వ తేదీన జిల్లెలగూడ చెరువు దగ్గర మధుసూదనాచారి అను వ్యక్తి వివిధ జిల్లాల నుండి అమ్ముడుపోని మద్యంను తీసుకొని వచ్చి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో తక్కువ ధరకు మద్యం అమ్ముతుండగా పట్టుకున్నారు. మాదన్నపేటలోని ఆ వ్యక్తి ఇంటిని సోదా చేయగా అక్కడ కూడా మద్యం బాటిళ్లను గుర్తించారు. ఈ దాడుల్లో మొత్తం 84 ఖరీదైన లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను సీగ్రామ్ అను మద్యం కంపెనీలో పనిచేస్తున్న అనిల్ కుమార్ అనే సేల్స్ ఎగ్జిక్యూటివ్ మధుసూదనాచారికి తక్కువ రేటుకు మద్యంను ఇప్పించగా, ఇట్టి మద్యం బహిరంగ మార్కెట్లో, వేరువేరు ఈవెంట్ పర్మిట్ గల ఫంక్షన్లకు తక్కువ రేటుకు మద్యం అందజేస్తున్నారు. నేరంకు పాల్పడిన మధుసూదనాచారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది అన్నారు. ఎక్సైజ్ అధికారుల అనుమతి లేకుండా ఈవెంట్లు జరపడం, ఈవెంట్లలో ప్రభుత్వ అనుమతి లేని డిఫెన్స్ లిక్కరు, ఫారిన్ లిక్కర్ సరఫరా చేయడం తీవ్రంగా పరిగణించబడి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్లెండర్ ప్రైడ్ విస్కీ 750ఎంఎల్‌వి 48 బాటిళ్లు, బల్లెంటీన్ ఫినిస్ట్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ 750ఎంఎల్‌వి 36 బాటిల్స్, ఒక మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీన సొత్తు మొత్తం విలువ రూ.1,60,000 ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సరూర్‌నగర్ కె.శ్రీనివాస్ రావు, డి.టి.ఎఫ్ సరూర్‌నగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్ట్టర్ స్టీవెన్సన్, సరూర్‌నగర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్ట్టర్ జి. శ్రీనివాస్ రావు, సబ్ ఇన్‌స్పెక్ట్టర్లు వెంకన్న, ముజాహిద్ షట్టరి, సిబ్బంది పాల్గొన్నారు.