Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
కూకట్ పల్లి సర్కిల్ ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ పి. రాంబాబు సమక్షంలో, ఎంటమాలాజికల్ క్రిమి సంబంధిత శాఖ అధికారులు పలు కాలనీల్లో పర్యటించారు, ధరణి నగర్, శంషిగూడ విలేజ్ ఆదిత్య నగర్ కాలనీ ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి గుంతల్లో, దోమలను నివారించే మూడు పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు, అందులో బయోలాజికల్ పద్ధతి, కెమికల్ పద్ధతి, ఇంజనీరింగ్ పద్ధతులపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు, ధరణి నగర్ కాలనీ, శంశిగూడా విలేజ్, ఆదిత్య నగర్ కాలనీ బేబీ పాండు నీటి నిల్వల గుంతలలో బయోలాజికల్ పద్ధతి ద్వారా గంబుషియ చేప పిల్లలను పలు గుంతల్లో వదిలారు. అదేవిధంగా కెమికల్ పద్ధతి, ఇంజనీరింగ్ పద్ధతి, ద్వారా ధరణి నగర్ కాలనీలోని పలు ఇండ్లల్లో నీటి నిల్వలను ఎంటమాజికల్ అధికార బందాలు తనిఖీ చేశాయి. ఎక్కువగా నీరు నిల్వ ఉన్న పాత్రలో కెమికల్ ద్వారా దోమలను నివారించడం, రెండవ పద్ధతి ఇంజనీరింగ్ పద్ధతి, తక్కువగా నీటి నిల్వ ఉన్న పాత్రలోని నీరు ను తొలగించడంతో పాటు, చిన్న చిన్న నీటి కుంటలను ఎంటమాలజీ సిబ్బంది కాలువ చేసి నీరు నిల్వ లేకుండా చేయడం ద్వారా దోమలను నివారించే విదంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కూకట్ పల్లి సర్కిల్ సీనియర్ ఎంటమాలజి, లచ్చి రెడ్డి, ఏఈ ఉషా రాణి, సూపర్ వైజర్ డి. నరసింహులు, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.