Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
జీవో నెంబర్ 6తో గంగపుత్రుల చేపల వృత్తి ప్రశ్నార్థకమైందని వెంటనే జీవోను రద్దు చేయాలని జాతీయ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు, జాతీయ ఉత్తమ మత్స్యరైతు అవార్డు గ్రతీహ అక్కపల్లి ఉదరుకిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర ఐక్య కార్యాచరణ సమితి కార్యనిర్వాహక కార్యదర్శుల ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని బీసీ భవన్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన ఉదరుకిరణ్ మాట్లాడుతూ జీవో 6తో సాంప్రదాయ మత్స్యకారులైన బెస్త, గూండ్ల కులాల వృత్తి ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీఓ 6ను వెంటనే రద్దు చేసి గంగపుత్రుల వత్తిని రక్షించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పాత గంగపుత్ర సొసైటీలలో గంగపుత్రులే ఉండేలా కొత్త జీఓ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంగపుత్రులకు ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలని అన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చెరువులలో విషం కలిపి చేపల మరణానికి కారణమవుతున్న ఇతర కులస్తులపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో గరిగె శ్రీహరి, పూస అమరానంద, గంగపుత్ర రవి, గాలి సత్యనారాయణ, కొప్పు పద్మ, రాణవేని లక్ష్మన్, సందిరి రవీందర్, ఎలుగు వెంకటేశ్వర్లు, గౌటి లక్ష్మణ్, పూస సత్యనారాయణ, దేశబోయిన రఘు. ఎల్లా ముత్తన్న, పల్లికొండ అరవింద్, పరె శ్రీను తదితరులు పాల్గొన్నారు.