Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 12వ తేదీన జల్పల్లి మున్సిపాల్టీలోని మరాఠి భవన్లో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్టు జల్పల్లి మున్సిపల్ రిప్రజెంటెటివ్ వైస్ చైర్మన్ యూసూప్ పటేల్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎక్బాల్ ఖలిఫా, కౌన్సిలర్ ఎండీ శంశోద్దిన్తో కలిసి జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్క రించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందనిన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించటానికి అనేక ప్రయివేటు కంపెనీలను తీసుకొస్తున్నట్టు తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.