Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ నల్లా ఇవ్వాలనే ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారని మల్కా జిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ జొన్నబండ వడ్డెర బస్తీలో తాగునీటి పైపులైను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ జలమండలి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు, కాలనీలకు మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తా మన్నారు. కాలనీలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని స్థానిక టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ ముదిరాజ్, బి.నాగేశ్వరరావు, బల్వంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొండల్, తదితరులు పాల్గొన్నారు.-