Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రంలోని పేదలందరికీ ఆహారం అందించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్ నగర పరిధిలోని 28వ డివిజన్లో నూతనంగా మంజురైన ఆహార భద్రత కార్డులను స్థానిక కార్పోరేటర్ చీరాల నర్సింహ అధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడం కోసం సర్కారు ఆహార భద్రత కార్డులను అందచేసి కుటుంబానికి సరిపడా బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో గతంలో ఉన్న కార్డులు కాకుండా మరో 1217 రేషన్ కార్డులు మంజురయ్యాయని తెలిపారు. ఈ కార్యక్ర మంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్మ్షీ రవి గౌడ్, కార్పొరే టర్లు కొత్త శ్రీ విద్యా ,దోంతబోయిన మహేశ్వరి, కాలనీ వాసులు సత్యనారాయణ పాల్గొన్నారు.