Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఏడాది కాలంగా బియ్యం, పప్పులు, వంట నూనె, కూరగాయలు ఇలా అన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయనీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు తగ్గకుండా నిర్ణయించాలనే డిమాండ్లతో నేడు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట చేపట్టే కార్మికుల ధర్నాను విజయ వంతం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కీసరి నర్సిరెడ్డి కోరారు. నాగోలు, మన్సూరాబాద్‌లో శుక్రవారం నిర్వహిం చిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, అందుకు ఎంత ఖర్చయినా చేయడానికి వెనుకాడమని ప్రకటనలు చేసిందన్నారు. దళిత ఎంపవర్మెంట్ సమావేశాల్లో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే అనీ, అందులో భాగంగా మున్సిపల్ కార్మికులకు పీర్సీ ప్రత్యేక నిర్ణయాత్మకమైన ప్రణాళికను నిర్వహిస్తామనీ, వారి వేతనాలు పెంచుతామనీ, ఉద్యోగ భద్రత కల్పిస్తామనీ, మరోసారి సఫాయి అన్నా.. మీకు సలాం అంటూ జీహెచ్ఎంసీ కార్మికులను పొగడ్తలతో ముంచెత్తడం తప్ప వారికి వేతనాల పెంపు విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి హైదరాబాద్‌ను శుభ్రం చేయడం, ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులను పర్మినెంట్ చేసే వరకు రూ.24 వేల వేతనం ఇవ్వాలన్నారు. సాహెబ్ నగర పరిధిలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుడికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలని కోరారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరి వేతనం వారి అకౌంట్లోనే వేయాలనీ, గ్రూప్ సిస్టం అమలు చేయవద్దనీ, గ్రూప్ ఎకౌంటులో వేతనాలు వేయాలనే ఆలోచనను విరమించుకోవాల న్నారు. జీహెచ్ఎంసీలో వివిధ కేటగిరీల పనులను ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలనీ, రాంకీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవాలనీ, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ప్రమాదాల్లో మరణించిన ప్రతి కార్మికుడికీ రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలనీ, మూడు వ్యవసాయ రైతు చట్టాలు, విద్యుత్ సవరణ 2020 బిల్లును ఉపసంహరించుకో వాలనే సమస్యలపై ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు.
నవతెలంగాణ-ఎల్బీనగర్
జీహెచ్ఎంసీ కార్మికులు నేడు చేపట్టనున్న ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలి అని సీఐటీయూ నాయకులు మల్లెపాక వీరయ్య కోరారు. శుక్రవారం పీఅండ్‌టీ కాలనీ, గడ్డి అన్నారం, దిల్‌సుఖ్‌నగర్‌లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.