Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. బల్దియా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తోంది. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపడుతోంది. సర్కార్ నుంచి నామమాత్రమే సాయం అందుతోంది. ఫలితంగా ఉద్యోగులకు వేతనాల్విలేని దుస్థితి దాపురించింది. కాంట్రాక్ట ర్లకు బిల్లులు చెల్లించలేని దయనీయమైన పరిస్థితి ఏర్పడింది.
అప్పులతోనే అభివృద్ధి పనులు..
జీహెచ్ఎంసీ పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయింది. కొత్త రోడ్లు వేయడానికి అప్పులు, ఉన్న రోడ్ల నిర్వహించడానికి అప్పులు చేసింది. ఎస్ఆర్డీపీ పనుల కోసం బాండ్ల ద్వారా రూ.495కోట్లు సేకరించింది. రూపీ టర్మ్‌లోన్ ద్వారా ఎస్బీఐ నుంచి రూ.2500 కోట్లు సేకరిం చింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కోసం మరో రూ.1460కోట్లు, జేఎన్ఎన్యూఆర్ఎం ఇండ్ల కోసం రూ.300 కోట్లకుపైగా రుణం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ మొత్తం రూ.4,595కోట్ల అప్పులు చేసింది.
సర్కార్ సాయమేది?
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. వేలాది కోట్ల రూపా యలతో చేపడుతున్న ప్రాజెక్టులకు నయాపైస ఇవ్వడం లేదు. వృత్తి పన్ను, వినోదపు పన్ను, మోటారు వాహనాల పన్నులో వాటాగా రావాల్సిన మొత్తంతోపాటు ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను వంటివి సైతం ఇవ్వడం లేదు. నగరంలోని వివిధ విభాగాల రాష్ట్ర ప్రభుత్వ భవనాల నుంచి ఏటా రూ.120 కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉండగా 2015 నుంచి పైసా కూడా ఇవ్వకపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ భవనాల నుంచి రూ.200 కోట్ల వరకు బకాయి పేరుకుపోయింది. 2014-15 నుంచి వివిధ ప్రాజెక్టులు, పనుల కోసం ఏడేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జీహెచ్ఎంసీకి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తోంది. దీంతో అప్పులు తీసుకొచ్చి ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్వహణ పనులు చేస్తోంది. ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలివ్వ డానికి పైసల్లేని దుస్థితి. ఏడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ రూ.10,287కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు పంపించింది. రూ. 1992.9కోట్లు కేటాయించి రూ.365కోట్లు విడుదల చేసింది.
వేతనాల్లేవు
జీహెచ్ఎంసీకి ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీలోపు వేతనాలు చెల్లించేవారు. ఈ ఈఏడాది కాలంగా 5వ తేదీలోపు వేస్తున్నారు. కానీ జులై వేతనాలు ఇంతవరకు ఇవ్వలేదు. అధికారులను అడిగితే డబ్బుల్లేవని చెబుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం ప్రతి నెలా రూ.110కోట్ల నిధు లు కావాలి. పట్టణ ప్రగతిలో భాగంగా మాత్రం ప్రభుత్వం ప్రతి నెలా రూ.78 కోట్లు చెల్లిస్తోంది. వేతనాలు చెల్లించాలంటే మరో రూ.32కోట్లు కావాలి. వీటిని కూడా సమకూర్చులేని పరిస్థితిలో జీహెచ్ఎంసీ కొట్టుమిట్టాడుతోంది.