Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సమాజంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈనెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఫొటోగ్రాఫర్లకు పోటీలు నిర్వహించనున్నారు. ఈపోటీలకు సంబంధించిన టెఫా వరల్డ్ ఫోటోగ్రఫీ డే పోస్టర్‌ను శుక్రవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో టెఫా సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానమన్నారు. ఫొటోగ్రాఫర్లలోని ఉత్తమ ప్రతిభను వెలికితీసేందుకు టెఫా నిర్వహిస్తున్న ఈకార్యక్రమాన్ని విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పోటీపై ఆసక్తి ఉన్న వారు ఎమోషన్ అనే అంశంపై టీసీఈఈ ఎంట్రీలను ఆహ్వానిస్తున్నాయని తెలిపారు. అద్భుత పనితీరుతో ఆకట్టుకుంటున్న తెలంగాణ ఫొటోగ్రాఫర్లందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.