Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ జోన్ సీఐటీయూ నాయకులు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
తొలగించిన 48 మంది పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ జోన్ సీఐటీయూ నాయకులు జై స్వామి, ఆర్ అశోక్, సాయి శేషగిరి రావు డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికులతో కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం జీహెచ్ఎంసీ సర్కిల్ 19 వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో 48 మందిని పారిశుధ్య కార్మికులుగా కాంట్రాక్టు పద్ధతిన డ్యూటీలోకి తీసుకున్నారన్నారు. కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరికి రూ. పదివేలు మాత్రమే చెల్లించి నాలుగు నెలలు పని చేయించుకున్నాడని తెలిపారు. మే 14 తర్వాత బిల్లులు రావటం లేదని, విధులకు రావొద్దని చెప్పి అప్పటినుంచి కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా పోయాడన్నారు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని వాపోయారు. అనంతరం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ నాగార్జునకు, శానిటరీ ఇన్స్పెక్టర్ విజరు కుమార్కు వినతపత్రం అందజేశారు. పది రోజుల్లో వేతనాలు ఇచ్చి, తిరిగి డ్యూటీలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం నలుగురు కార్మికులు ఇద్దరు సూపర్వైజర్లకు సుమారు లక్ష రూపాయలు ఇచ్చామని, తమ డ్యూటీలు పర్మినెంట్ చేయిస్తానని మోసం చేసి తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని బహిరంగంగా అధికారులతో విజ్ఞప్తి చేసుకున్నారు. సీఐటీయూ నాయకులు, డీవైఎఫ్ఐ శ్రీను పాల్గొన్నారు.