Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అర్హులందరికీ కొత్తరేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శుక్రవారం శ్రీనగర్ కాలనీలో సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి 210 రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రతి ఒక్క కార్డుదారులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ప్రత్యేక కానుకలు అందించారు. ఈఅవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడు అండగా ఉండాలని స్థానికులను సూచించారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, తను, అప్పు పాల్గొన్నారు.